← Back to news

గుర్తుతెలియని వాహనం ఢీ.. వ్యక్తి మృతి!

By Bala· 1d ago
గుర్తుతెలియని వాహనం ఢీ.. వ్యక్తి మృతి!

చిత్తూరు-పీలేరు నేషనల్ హైవేపై పూతలపట్టు మండలం తలపలపల్లి వద్ద ఇవాళ ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో రఫీ అనే హమాలీ మృతి చెందాడు. పీలేరుకు చెందిన రఫీ పూతలపట్టు పౌరసరఫరాల గోదాములో పనిచేస్తున్నాడు. తల్లిదండ్రులను చూసేందుకు పీలేరుకు బయలుదేరిన ఆయనను మార్గమధ్యలో గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

More in Local