ఇక్కడ భయంతోనే డ్యూటీ చేయాలి

TG: వికారాబాద్ జిల్లా మర్పల్లి తహసీల్దార్ కార్యాలయ భవనం శిథిలావస్థకు చేరింది. భవనం ఎప్పుడు కూలుతుందోనన్న భయంతో ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ భవనంలో వివిధ విభాగాలకు చెందిన సుమారు 40మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. వర్షాకాలం వస్తే పైకప్పు నుంచి నీరు కారి లోపలంతా చిత్తడిగా మారుతోంది. వాన పడిన ప్రతిసారీ విలువైన భూరికార్డులు తడిసిపోకుండా ఉండేందుకు ప్లాస్టిక్ కవర్లతో కప్పాల్సిన దుస్థితి నెలకుందని అధికారులు తెలిపారు.



