దుగ్గిరాలలో ఎన్నికల హడావిడి.. అధికారుల ఫుల్ రెడీ!
దుగ్గిరాల మండలంలో MPTC, ZPTC స్థానిక ఎన్నికలపై అధికారుల సమావేశం జరిగింది. శుక్రవారం మధ్యాహ్నం మండల పరిషత్ కార్యాలయంలో ఈ మీటింగ్ నిర్వహించారు. ఈ నెల 19న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. ఎన్నికల నిర్వహణకు ముందస్తు చర్యలు, విధులు, బాధ్యతలపై అధికారులు సూచనలు ఇచ్చారు. సమావేశంలో మండల రిటర్నింగ్ అధికారి టి. నరసింహారెడ్డి, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి ఏ. శ్రీనివాసరావు, కార్యాలయ ఏవో వి. చంద్రమోహన్, పంచాయతీ అధికారి తెనాలి మురళీకృష్ణ, పాల్గొన్నారు.



