APకి 750 ఎలక్ట్రిక్ AC బస్సులు!

AP: రాష్ట్రానికి త్వరలో 750 కొత్త ఎలక్ట్రిక్ AC బస్సులు రానున్నాయని ట్రాన్స్‌పోర్ట్ మినిస్టర్ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ఇకపై పల్లె వెలుగు, స్త్రీశక్తి బస్సులు కూడా ఎలక్ట్రిక్ ఏసీ బస్సులుగానే తీసుకొస్తామన్నారు. ప్రొద్దుటూరులో కొత్త RTC బస్టాండ్‌ను ప్రారంభించిన మంత్రి.. పెండింగ్‌లో ఉన్న కంపాషనేట్ అపాయింట్‌మెంట్స్ చేస్తున్నామని, ఉద్యోగుల అలవెన్సులు పెంచామని చెప్పారు. స్త్రీశక్తి పథకాన్ని బాధ్యతగా అమలు చేస్తున్నామని అన్నారు.



