గుత్తి మున్సిపల్ నామినేషన్లు.. కలెక్టర్ ఫుల్ చెక్!

అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీలో నామినేషన్ల ప్రక్రియ స్మూత్గా సాగుతోంది. జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి ఓ. ఆనంద్ బుధవారం పరిశీలించారు. ZPHS (బాలికల) లో స్ట్రాంగ్ రూములు, కౌంటింగ్ సెంటర్లను తనిఖీ చేశారు. కుల, ఆదాయ ధృవీకరణ పత్రాలను 24 గంటల్లోగా ఇవ్వాలని ఆదేశించారు. శాంతిభద్రతల ఇష్యూ లేకుండా ఏర్పాట్లు చేశామని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ సుయాష్ కుమార్, మున్సిపల్ కమిషనర్ సురేంద్ర, తహసీల్దార్ పుణ్యవతి పాల్గొన్నారు.




