సబ్స్టేషన్లో సీఎండీ సర్వే.. విద్యుత్ కోతలు వద్దు!

ఖమ్మం సర్కిల్లో విద్యుత్ డిమాండ్ పెరుగుతోంది. టీజీఎన్పీడీసీఎల్ CMD కర్నాటి వరుణ్ రెడ్డి (IAS) శుక్రవారం 220/132/33 కేవీ పెద్దగోపతి సబ్స్టేషన్ను సందర్శించారు. సరఫరా పరిస్థితిని సమీక్షించారు. వ్యవసాయ అవసరాలకు విద్యుత్ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో అంతరాయాలు లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సాంకేతిక సమస్యలు వెంటనే పరిష్కరించాలన్నారు. పర్యటనలో ఎస్ఈ శ్రీనివాస చారి, డీఈ వైరా, ఏఈ, టీజీ ట్రాన్స్కో సిబ్బంది పాల్గొన్నారు.



