కర్నూలు మేయర్ అభ్యర్థిని ప్రకటించిన వైసీపీ

కర్నూలు నగరపాలక సంస్థ మేయర్ అభ్యర్థిగా వైసీపీ తరఫున కోడుమూరు మాజీ ఎమ్మెల్యే మణిగాంధీ సతీమణి సుశీలమ్మ పేరును పార్టీ కేంద్ర కార్యాలయం ఖరారు చేసింది. SC మహిళా రిజర్వేషన్ కోటాలో ఆమెను ఎంపిక చేసినట్లు ప్రకటించింది. మేయర్ అభ్యర్థిగా సుశీలమ్మ పేరు ఖరారు కావడంతో ఆమె నివాసంలో కుటుంబసభ్యులు, అభిమానులు సంబరాలు చేసుకున్నారు.



