పండుగకూ పస్తులే.. పంచాయతీ కార్మికుల బాధ!

కరీంనగర్ జిల్లాలో దసరా, సద్దుల బతుకమ్మ వేళా గ్రామ పంచాయతీ కార్మికులకు సెప్టెంబర్ వేతనాలు ఇంకా రాలేదు. నెలంతా శ్రమించినా జీతాలు అందక కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయి. నెలకు ₹9,500 కనీస వేతనం కూడా సకాలంలో రావడం లేదని యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొప్పుల శంకర్ ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.



