భూభారతి సేవలకు ఆధార్ ధ్రువీకరణ తప్పనిసరి!

TG: భూభారతి పోర్టల్ ద్వారా భూములకు సంబంధించిన సేవలు పొందాలంటే ఆధార్ ధ్రువీకరణ తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. భూముల రిజిస్ట్రేషన్, పట్టాదారు పాస్బుక్ మార్పులు, వారసత్వ హక్కుల బదిలీ, వ్యవసాయ భూముల మార్పిడి వంటి సేవలకు ఆధార్ ఆధారిత కేవైసీ చేయాలని ఆదేశించింది. ఆధార్ వివరాలను ఉపయోగించే ముందు సంబంధిత వ్యక్తుల అనుమతి తీసుకోవాలని అధికారులు సూచించారు. దీనివల్ల భూ వ్యవహారాల్లో పారదర్శకత పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
