మట్టి వినాయకుడే ముద్దు

వినాయక చవితి సందర్భంగా కరీంనగర్‌లో సంఘసేవకులు గాలిపెల్లి కుమార్, యువ సంకల్పం ఫౌండేషన్ ప్రెసిడెంట్ తుమ్మ రాజ్‌కుమార్ కలిసి ఉచితంగా మట్టి వినాయక విగ్రహాలు పంచారు. కెమికల్ విగ్రహాల వల్ల నీళ్లు పాడై పర్యావరణానికి చాలా నష్టం జరుగుతుందని, అందుకే అందరూ మట్టి గణపతులనే వాడాలని చెప్పారు. గత 18 ఏళ్లుగా రాజ్‌కుమార్ మట్టి విగ్రహాలపై అవగాహన కలిగిస్తుండటాన్ని కుమార్ అభినందించారు. Environmentని కాపాడుకోవడానికి, మీరు కూడా మీ ఊరి మట్టి గణేశ్‌తో ఫొటోలు తీసుకొని మాకు పంపండి. మేం అందరికీ చూపిస్తాం.

