లోకేష్ విశాఖ పర్యటన- ఐద్వా నాయకుల నిర్బంధం

AP: విద్యాశాఖ మంత్రి లోకేష్ విశాఖ పర్యటన సందర్భంగా ఐద్వా నాయకులను హౌస్ అరెస్ట్లు చేశారు. మారకవలస గురుకుల పాఠశాల వివాదం నేపథ్యంలో మంత్రి లోకేష్ స్థానికంగా పర్యటించారు. ఈ గురుకుల పాఠశాల తరలించకూడదని ఐద్వా SFI, DYFI ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. నిన్న చంద్రబాబు పాడేరు పర్యటనలో ఈ పాఠశాల తరలింపుపై హామీ ఇచ్చి మళ్లీ యూటర్న్ తీసుకోవడంతో వివాదం మొదటికి వచ్చింది. దీంతో ఈ సంఘాల నాయకులను హౌస్ అరెస్ట్ చేశారు.



