నర్సంపేటను దత్తత తీసుకుంటానన్న KTR

వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గానికి పెద్దదిక్కుగా ఉంటానని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ప్రకటించడం పట్ల ఎన్నారై భాస్కర్ పిన్నా హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్లో జరిగిన సమావేశంలో కేటీఆర్ ఇచ్చిన హామీ పార్టీ కేడర్లో కొత్త జోష్ నింపిందన్నారు. పెద్ది సుదర్శన్రెడ్డి ఆశయాలను కొనసాగిస్తూ ఆయన కలలుగన్న నర్సంపేట అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు.



