బస్సు ప్రమాదంలో చిన్నారికి తీవ్ర గాయాలు

గుంటూరు జిల్లా మంగళగిరి RTC బస్టాండ్లో బస్సు ప్రమాదంలో బాలాజీనగర్కు చెందిన పేర్ల దాక్షిత్(4) తీవ్రంగా గాయపడ్డాడు. అమరావతి వెళ్లే బస్సు అదుపుతప్పి ప్లాట్ఫాంపై కుర్చీల్లో కూర్చున్న ప్రయాణికులపైకి దూసుకెళ్లడంతో బాలుడి Private partsకు గాయాలయ్యాయి. స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి, అక్కడి వైద్యుల సూచనతో తాడేపల్లి మణిపాల్ ఆసుపత్రికి తరలించారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న బాలుడికి శస్త్రచికిత్స చేయాలని వైద్యులు సూచించినట్లు తాతయ్య పేర్ల కృష్ణ తెలిపారు.



