← Back to news

రైతు తోటలో డ్రిప్ పనితీరు పరిశీలన

By Md Jabeer· 1h ago· Al Faysaliyah, Dammam, Dammam Principality
రైతు తోటలో డ్రిప్ పనితీరు పరిశీలన

TG: నిర్మల్ జిల్లా పెంబి మండలంలో ఆయిల్‌పామ్ తోటలో డ్రిప్ ఇరిగేషన్ పనితీరును ఉద్యానవన శాఖ అధికారులు మంగళవారం పరిశీలించారు. నిర్మల్ డివిజన్ ఉద్యానవన అధికారి మౌనిక, జైన్ కంపెనీ DCO నాగరాజుతో కలిసి రైతు సల్ల రాము తోటను సందర్శించారు. డ్రిప్ ద్వారా నీటి వినియోగం, మొక్కలకు అందుతున్న నీటి తీరును పరిశీలించి, నీటి యాజమాన్య పద్ధతులపై రైతుకు సూచనలు చేశారు. డ్రిప్ ఇరిగేషన్‌తో నీటిని ఆదా చేయడంతో పాటు ఆయిల్‌పామ్ మొక్కల ఎదుగుదల మెరుగుపడుతుందని తెలిపారు.

రైతు తోటలో డ్రిప్ పనితీరు పరిశీలన

More in Local