మహిళా ఉద్యోగుల బతుకమ్మ వేడుకలు

తెలంగాణ సాంస్కృతిక సంప్రదాయాలకు బతుకమ్మ పండుగ ప్రతీక అని ఖమ్మం జిల్లా జేఏసీ లీడర్ కొంగర వెంకటేశ్వర్లు అన్నారు. TGOS ఖమ్మం జిల్లా మహిళా ఎంప్లాయీస్తో కలిసి నిర్వహించిన బతుకమ్మ ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. తెలంగాణ సంస్కృతిని నెక్స్ట్ జనరేషన్కి అందించడంలో ఈ వేడుకలు కీ రోల్ ప్లే చేస్తాయన్నారు. మహిళా ఉద్యోగులు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, సంప్రదాయ పాటలతో ఉత్సాహంగా పాల్గొన్నారు.



