‘S.I.R’పై తగ్గేదేలే అంటున్న రాహుల్!

TG: S.I.R ప్రక్రియకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పోరాటం కొనసాగుతుందని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. పార్టీ యువజన, విద్యార్థి విభాగాలు మెరుపు నిరసనలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఢిల్లీలో యువజన, విద్యార్థి నాయకులతో జరిగిన సమావేశంలో, నిరసనల్లో ధైర్యంగా పాల్గొన్న వారిని అభినందించారు. ముఖ్యంగా తెలంగాణకు చెందిన NSUI ప్రధాన కార్యదర్శి అనులేఖ బూసాను ప్రశంసించారు. నిరసన సమయంలో పోలీసుల చర్యలతో తన కుడిచేతికి గాయమైందని ఆమె రాహుల్కు వివరించారు.


