సబ్‌స్టేషన్ వద్ద BJP కిసాన్ మోర్చా ధర్నా

విద్యుత్ కోతలతో పంటలు ఎండిపోతున్నాయని ఆరోపిస్తూ BJP కిసాన్ మోర్చా నాయకులు ఇవాళ ఖమ్మం హైవేపై తిమ్మాపురం సబ్‌స్టేషన్ వద్ద ధర్నా నిర్వహించారు. రైతులకు నిరంతరాయ విద్యుత్ సరఫరా చేయాలని, ఫసల్ బీమా యోజన అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పోలీసులకు, BJP నాయకులకు మధ్య వాగ్వాదం జరగడంతో ఉద్రిక్తత నెలకొంది. డిమాండ్లు నెరవేర్చకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని నాయకులు హెచ్చరించారు.



