← Back to news

డప్పు చప్పుళ్ల మధ్య కొందుర్గులో గణనాథుడి ఆగమనం

By A Srisailam· 2d ago· Kondurg (E), Kondurg, Ranga Reddy
డప్పు చప్పుళ్ల మధ్య కొందుర్గులో గణనాథుడి ఆగమనం

TG: రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండల కేంద్రంలోని శ్రీ ఉమా మహేశ్వర కాలనీలో గణేష్ ఆగమన వేడుకలు ఘనంగా నిర్వహించారు. డప్పు చప్పుళ్లు, తీన్మార్ నృత్యాలు, గణేష్ మహారాజ్ నినాదాల మధ్య వినాయక విగ్రహాన్ని ఊరేగింపుగా మండపానికి తరలించి ప్రతిష్ఠించారు. ఈ వేడుకల్లో కాలనీ యువత, యూత్ సభ్యులు, భక్తులు, స్థానికులు ఉత్సాహంగా పాల్గొన్నారు. గణనాథుడి ఆగమనంతో కొందుర్గులో పండుగ సందడి నెలకొంది. రానున్న గణేష్ నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు.

డప్పు చప్పుళ్ల మధ్య కొందుర్గులో గణనాథుడి ఆగమనం

More in Local