మతం వేరైనా.. భక్తిలో భాషా–రజియా వన్!

వరంగల్ నగరానికి చెందిన భాషా–రజియా దంపతులు మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్నారు. గత కొన్నేళ్లుగా నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. భక్తులకు అన్నదానం కూడా చేస్తున్నారు. మతాలకు అతీతంగా వారి సేవలు ఆదర్శనీయమని పలువురు కొనియాడారు. సమాజంలో మతసామరస్యానికి ఈ దంపతులు నిలువెత్తు నిదర్శనమని స్థానికులు ప్రశంసించారు.



