← Back to news

BJP Vs BJP.. SPపైనే రాళ్ల దాడి!

By sahani· 11 Jul 2026· X· Uttar pradesh

మధ్యప్రదేశ్‌లోని దాటియా ఉపఎన్నిక BJP టికెట్ వివాదం తీవ్ర అల్లర్లకు దారితీసింది. మాజీ హోంమంత్రి నరోత్తం మిశ్రాను కాదని అశుతోష్ తివారికి BJP అధిష్ఠానం టికెట్ ఇవ్వడంతో మిశ్రా అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దాదాపు 3 వేల మంది కార్యకర్తలు NH-44 హైవేని 12 గంటల పాటు బ్లాక్ చేశారు. నిరసనకారులను చెదరగొట్టేందుకు వచ్చిన పోలీసులపై రాళ్ల దాడి జరగడంతో జిల్లా SPతో సహా కొంతమంది గాయపడ్డారు. టెన్షన్ వతావరణాన్ని తగ్గించడానికి పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. జులై 30న ఇక్కడ పోలింగ్ జరగనుంది.

More in Politics