నాణ్యమైన విద్య అందరికీ అందాలి: పవన్ కుమార్

హైదరాబాద్లో జరిగిన AIKS (అఖిల భారత కిసాన్ సభ) మహాసభలో SFI నారాయణపేట జిల్లా కార్యదర్శి కామ్రేడ్ పవన్ కుమార్ జిల్లా నివేదికను ప్రవేశపెట్టారు. ఈ నివేదికలో జిల్లాలో విద్యార్థి ఉద్యమ నిర్మాణం, ప్రభుత్వ విద్యారంగంలో సమస్యలు, విద్యాసంస్థలకు మౌలిక వసతుల కల్పన, విద్యార్థుల హక్కుల పరిరక్షణ కోసం SFI చేస్తున్న పోరాటాలను వివరించారు. విద్యార్థుల సమస్యలపై నిరంతరం పోరాడుతూ, అందరికీ సమానమైన నాణ్యమైన విద్య అందేలా ఉద్యమాలను మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.



