తుంగభద్రకు ఇన్‌ఫ్లో డౌన్...

తుంగభద్ర జలాశయానికి గడిచిన 24 గంటల్లో 10,989 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. మంగళవారం ఉదయానికి ఇన్‌ఫ్లో తగ్గింది. టీబీ డ్యామ్ బోర్డు అధికారులు ఈ వివరాలు తెలిపారు. ప్రస్తుతం డ్యామ్‌లో నీటిమట్టం 1,627.75 అడుగులు ఉంది. నిల్వ 85.85 టీఎంసీలు ఉంది. వివిధ కాలువలకు, నదికి కలిపి 11,202 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. వరద ప్రవాహం తగ్గడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. నీటి నిల్వ తగ్గితే సాగునీటి సరఫరాపై ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించాలి.



