దసరా రద్దీకి చెక్.. 325 ప్రత్యేక బస్సులు

AP: దసరా సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో 325 ప్రత్యేక RTC బస్సులు నడపనున్నారు. ఈ నెల 16 నుంచి 21 వరకు విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి సర్వీసులు అందుబాటులో ఉంటాయి. హైదరాబాద్-విజయవాడ రూట్‌కు 70 బస్సులు, చెన్నై, బెంగళూరుకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. ఇతర ప్రధాన నగరాలకు కూడా సర్వీసులు నడపనున్నారు. రాయలసీమ జిల్లాలకు వెళ్లే కాలేజీ విద్యార్థుల కోసం మరో 20 బస్సులు కేటాయించారు. రద్దీని బట్టి మరిన్ని బస్సులు నడపనున్నారు.



