← Back to news

వయోవృద్ధులతో బతుకమ్మ సంబరాలు!

By Sravan Kumar· 16h ago· Manthani, Manthani, Peddapalli
వయోవృద్ధులతో బతుకమ్మ సంబరాలు!

పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని ప్రణాం డే కేర్ సెంటర్‌లో వయోవృద్ధులతో కలిసి బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. ఫీల్డ్ రెస్పాన్స్ అఫీసర్ స్వర్ణలత మాట్లాడుతూ, రంగురంగుల పూలతో బతుకమ్మలు పేర్చి ఆటపాటలతో వేడుకలు నిర్వహించామన్నారు. ఇలాంటి కార్యక్రమాలు వయోవృద్ధుల్లో మానసిక ఉల్లాసం నింపుతాయని, తెలంగాణ సంస్కృతిని చాటుతాయని తెలిపారు. కార్యక్రమంలో పీటీ స్వామి, ఐసీడీఎస్ సూపర్‌వైజర్లు, అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు, సిబ్బంది, వయోవృద్ధులు పాల్గొన్నారు.

More in Local