← Back to news

పర్యావరణ పరిరక్షణకు మట్టి వినాయకులే మేలు

By DK· 2d ago
పర్యావరణ పరిరక్షణకు మట్టి వినాయకులే మేలు

TG: పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి వినాయక విగ్రహాలనే ప్రతిష్ఠించాలని నల్లగొండ డీఎస్పీ కే. శివరాం రెడ్డి పిలుపునిచ్చారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాల (ఎన్జీ కాలేజ్) వద్ద మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. కెమికల్ రంగులతో కూడిన విగ్రహాల వల్ల జలాశయాలు కలుషితమవుతాయని తెలిపారు. సహజసిద్ధమైన మట్టి గణపతులను పూజించడం ద్వారా నీటి కాలుష్యాన్ని తగ్గించవచ్చన్నారు. వినాయక చవితి సందర్భంగా పర్యావరణహిత కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు.

More in Local