తెలంగాణ ప్రభుత్వంలో అవినీతి రాజ్యమేలుతోంది: KTR

TG: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నేరుగా సీఎం స్థాయిలోనే అవినీతి జరుగుతోందని ఆయన ఆరోపించారు. X అకౌంట్లో సీఎం రేవంత్ రెడ్డిపై, కాంగ్రెస్ హైకమాండ్‌పై విమర్శలు చేశారు. సీఎం కార్యాలయం 15 శాతం కమీషన్ డిమాండ్ చేసిందని ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ ఎండీ ఆరోపించిన విషయాన్ని కేటీఆర్ తన పోస్ట్‌లో ప్రస్తావించారు. ప్రాజెక్ట్‌లను అర్హులైనవారికి కాకుండా, నచ్చినవారికి కట్టబెడుతున్నారని మండిపడ్డారు.



