← Back to news

రూ.4 లక్షల ఐఫోన్‌.. మీమర్లకు పండగ!

By Anusha· 10 Sept 2026
రూ.4 లక్షల ఐఫోన్‌.. మీమర్లకు పండగ!

యాపిల్‌ కొత్త ఫోల్డబుల్ ఐఫోన్ డ్యూయోపై సోషల్‌ మీడియాలో మీమ్స్‌ వైరల్‌ అవుతున్నాయి. దాదాపు రూ.4 లక్షల స్టార్టింగ్ ప్రైస్ ఉండటంతో.. 'ఫోన్‌ బదులు కొత్త కారు కొనుక్కోవచ్చు కదా!' అంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. భారత్‌తో పోలిస్తే బ్యాంకాక్‌లో ఈ ఫోన్‌ దాదాపు రూ.60 వేల వరకు Low ప్రైస్‌లో దొరుకుతుందన్న చర్చ కూడా జరుగుతుంది. దీంతో 'రెండు రోజుల బ్యాంకాక్‌ ట్రిప్‌ వేసి.. పనిలో పనిగా ఫోన్‌ కొనుక్కుందాం' అంటూ మీమర్లు పోస్ట్‌లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ మీమ్స్ సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండింగ్‌లో ఉన్నాయి.

రూ.4 లక్షల ఐఫోన్‌.. మీమర్లకు పండగ!

More in Viral