దుర్గమ్మ సన్నిధిలో మీడియాకు నో ఎంట్రీ?
విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల వేళ మీడియాకు ఎదురవుతున్న ఇబ్బందులు చర్చకు దారితీశాయి. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు ప్రాధాన్యం ఇస్తూ, జర్నలిస్టులను అడ్డుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. భక్తుల సమస్యలు, దర్శన ఏర్పాట్లను ప్రజలకు తెలియజేసే మీడియాకు అడ్డంకులు ఎందుకనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. భద్రత పేరుతో ఆంక్షలు విధిస్తే అందరికీ ఒకేలా ఉండాలి. మీడియాకు స్పష్టమైన రూల్స్ రూపొందించి, వార్తా సేకరణకు అవకాశం కల్పించాలని పలువురు కోరుతున్నారు.



