మహిళల సారెతో దుర్గమ్మకు స్పెషల్ పూజ!

గుంటూరు జిల్లా మంగళగిరి వీవర్స్ కాలనీలోని ఎంటీఎంసీ హైస్కూల్ వద్ద శ్రీ దుర్గా భవాని భక్త బృందం ఆధ్వర్యంలో శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. మహిళా భక్తులు పసుపు, కుంకుమ, చీరలు, పూలు, పండ్లతో సారె ఊరేగింపు నిర్వహించారు. మండపం నుంచి ఆత్మకూరు రోడ్డు, ఎల్బీనగర్, వీవర్స్ కాలనీ, శాలివాహన నగర్ మీదుగా ఊరేగింపు సాగింది. కార్యక్రమంలో మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



