← Back to news

అక్రమ భూ రిజిస్ట్రేషన్లు.. ఎంఆర్వో విచారణ ప్రారంభం!

By Kamal Kumar· 17h ago· Tandur, Tandur, Vikarabad
అక్రమ భూ రిజిస్ట్రేషన్లు.. ఎంఆర్వో విచారణ ప్రారంభం!

వికారాబాద్ జిల్లా తాండూరు మండలం గుంతబాసుపల్లి గ్రామంలో అక్రమ భూ రిజిస్ట్రేషన్లు జరిగాయని గ్రామస్థులు ఆరోపించారు. బాధితులు తాండూరు MRO తారాసింగ్‌కు ఫిర్యాదు చేశారు. స్పందించిన ఎంఆర్వో శుక్రవారం గ్రామాన్ని సందర్శించి బాధితుల నుంచి వివరాలు సేకరించారు. భూములకు సంబంధించిన పత్రాలను పరిశీలించి.. సమగ్ర విచారణ చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అక్రమ రిజిస్ట్రేషన్లపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి, తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని MRO తెలిపారు.

అక్రమ భూ రిజిస్ట్రేషన్లు.. ఎంఆర్వో విచారణ ప్రారంభం!
అక్రమ భూ రిజిస్ట్రేషన్లు.. ఎంఆర్వో విచారణ ప్రారంభం!

More in Local