కాంగ్రెస్ నిర్లక్ష్యమే కారణం: KTR

TG: BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు, రాష్ట్రంలోని నీటి సంక్షోభానికి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని, జూన్ 2026 నుండి 750 TMCలకు పైగా గోదావరి, 250 TMCల కృష్ణా నీటిని దిగువకు వదిలేశారని అన్నారు. కన్నెపల్లి, దేవాదుల పంపులను సరిగ్గా వినియోగించలేదని ఆయన విమర్శించారు. పాలమూరు - రంగారెడ్డి, KLI పంపులను ఆన్ చేయకుండా.. నీళ్లను వృథా చేసారు, ఎల్ నినో హెచ్చరికలు ఉన్నా.. ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు.
