ఆలయంలో ప్రత్యేక పూజలు

అనంతపురం జిల్లా గుత్తి మండలం కొత్తపేట గ్రామంలోని నవ అహోబిలం లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో నరసింహ నవరాత్రుల నాలుగో రోజు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. భక్తుల రాకతో ఆలయం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.



