P.G. మెడికల్ ‘కన్వీనర్’ సీట్లకు నేటి నుంచే అప్లికేషన్లు

తెలంగాణలో 2026-27 విద్యా సంవత్సరానికి P.G. మెడికల్ డిగ్రీ కోర్సుల్లో కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి కాళోజీ హెల్త్ యూనివర్సిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన నాన్-సర్వీస్, ఇన్-సర్వీస్ అభ్యర్థులు ఈరోజు సాయంత్రం 4 గంటల నుంచి 23వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు <a href="https://tspgmed.tsche.in/">వెబ్సైట్లో</a> అప్లై చేసుకోవాలి. సర్టిఫికెట్లను కూడా ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి. నీట్ P.G-2026లో అర్హత సాధించి, తెలంగాణ స్థానికత ఉన్నవారే ఈ సీట్లకు అర్హులు.


