ఓటర్ల టెన్షన్..ఉంటుందా? డిలీట్ చేస్తారా?

వరంగల్ జిల్లా నర్సంపేటలో SIR ఫారాలు రిజెక్ట్ అయ్యాయన్న సమాచారంతో వేరే సిటీస్‌కి షిఫ్ట్ అయిన ఓటర్లు టెన్షన్ పడుతున్నారు. 'మా ఓటు ఉంటుందా? డిలీట్ చేస్తారా?' అని ఆఫీసర్లకు ఫోన్లు చేస్తున్నారు. క్లారిటీ లేకపోవడంతో చాలామంది నర్సంపేటకి వచ్చి ఎంక్వైరీ చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి, అవగాహన కల్పించాలని కోరుతున్నారు. ఇప్పటివరకు ఆఫీసర్ల నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడంతో ప్రజలు ఆవేదన చెందుతున్నారు.
