NSUI నిరసనపై వివాదం.. పోలీసుల తీరుపై ఆరోపణలు
‘Vote Chori’కి వ్యతిరేకంగా నిరసన తెలిపిన <a href="https://www.theclearcutnews.com/n/tXxzrr8">NSUI విద్యార్థినుల</a> పట్ల ఢిల్లీ పోలీసులు దురుసుగా ప్రవర్తించారని ఆరోపణలు వస్తున్నాయి. విద్యార్థినుల గొంతు నొక్కడం, ముఖంపై గోళ్లతో గీరడం, బూట్లతో తన్నడం వంటి చర్యలకు పాల్పడ్డారని కాంగ్రెస్ వర్గాలు ఆరోపించాయి. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కును ప్రశ్నిస్తూ.. మహిళల భద్రత, గౌరవంపై ఆందోళనలు రేకెత్తిస్తోందని పేర్కొంటూ, బాధ్యులను గుర్తించి జవాబుదారీగా వ్యవహరించేలా చర్యలు తీసుకోవాలని NSUI డిమాండ్ చేసింది.


