← Back to news

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్!

By Nani Eluri· 19h ago· X

TG; హైదరాబాద్ గాంధీ భవన్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన కాంగ్రెస్ నేతలు మీటింగ్ నిర్వహించారు. ఏఐసీసీ ఇన్‌చార్జ్ సెక్రటరీ సచిన్ సావంత్, డీసీసీ అధ్యక్షులు మోత రోహిత్, దీపక్ జాన్‌తో పాటు నేతలు పాల్గొన్నారు. గ్రాడ్యుయేట్ ఓటర్ల రిజిస్ట్రేషన్ పెంచడం, కొత్త ఓటర్లను గుర్తించడం, ఎన్నికలకు పార్టీని సిద్ధం చేయడంపై చర్చించారు. 15 నియోజకవర్గాల ఇన్‌చార్జులు, పీసీసీ కోఆర్డినేటర్లు హాజరై ఓటర్ల నమోదుపై సూచనలు ఇచ్చారు. ఎన్నికల ప్లాన్‌పై కూడా చర్చించారు.

More in TG