← Back to news

నీటి వివాదానికి తెర.. పోలీసుల జోక్యంతో సమన్యాయం! 💧

By Jagadish· 2d ago
నీటి వివాదానికి తెర.. పోలీసుల జోక్యంతో సమన్యాయం! 💧

నంద్యాల జిల్లాలోని మహానంది మండలంలో రెండు గ్రామాల మధ్య తెలుగుగంగ నీటిపై రగడ చెలరేగింది. తమ్మడపల్లి, నందిపల్లి రైతులు ఇంజవాణి చెరువు నీటిపై ఘర్షణకు దిగారు. తమ్మడపల్లి రైతులు 11వ సబ్ ఛానెల్ వద్ద అడ్డుకట్ట వేయగా.. నందిపల్లి రైతులు దాన్ని తొలగించేందుకు ప్రయత్నించారు. విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. ఎస్సై రామ్మోహన్ రెడ్డి ఇరు గ్రామాల రైతులతో మాట్లాడి సమన్యాయం చేశారు. ఇరు వర్గాలు సమంగా నీరు పంచుకోవడానికి అంగీకరించాయి. అడ్డుకట్టను తొలగించి.. అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు.

More in Local