సింగుపురం గ్రామంలో భారీ మట్టి గణపతి!

శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం రూరల్ మండలం సింగుపురం గ్రామంలో ఎకో-ఫ్రెండ్లీ వినాయకుడు కొలువుదీరాడు. గ్రామస్తులు ఈసారి మట్టి గణపతిని పూజించి పర్యావరణాన్ని కాపాడుతున్నారు. మట్టి గణపతి పూజ వల్ల తమతో పాటు చుట్టుపక్కల పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుందని వారు అంటున్నారు. దేవుడి ఆశీస్సులు కూడా ఉంటాయని ఆకాంక్షిస్తున్నారు. గ్రామస్తులు సంబరాలు జరుపుకుంటున్నారు. ప్లాస్టిక్ విగ్రహాల వల్ల జల వనరులు కలుషితమవుతాయని, మట్టి విగ్రహాలే బెస్ట్ అని వారు చెబుతున్నారు. మీరూ మట్టిగణపతిని పెడితే మాకు ఫొటో, వార్త పంపండి.
