← Back to news

నోయిడాలో కార్మికుల నిరసన ఉద్రిక్తం

By aravinda nyayapati· 13 Apr 2026· Telugu Report· Hyderabad

యూపీలోని నోయిడా ఫేజ్-2లో కార్మికులు జీతాలు పెంచాలన్న డిమాండ్ తో భారీ నిరసన చేపట్టారు. హర్యానా తరహాలో 35% జీతాల పెంపు కోరుతూ జరిగిన ఈ ఆందోళన ఉద్రిక్తంగా మారింది. నిరసనకారులు రాళ్లు రువ్వడంతో పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు. ప్రతి నెలా 10లోపు జీతాలు ఇవ్వాలని, ఓవర్ టైమ్‌కు రెట్టింపు డబ్బులు ఇవ్వాలని అధికారులు యాజమాన్యాలకు ఆదేశాలిచ్చారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అదనపు బలగాలు మోహరించాయి.

More in Local