GenZలు ట్రావెల్ చేయడం లేదా?

భారత్‌లో జీతం పొందుతున్న GenZ యువత ఖర్చులపై SalarySe అధ్యయనం ఆసక్తికర విషయాలను వెల్లడించింది. 5.2 లక్షలకు పైగా Gen Z వినియోగదారుల UPI లావాదేవీలను పరిశీలించింది. వీరి ఖర్చుల్లో బిల్లులు, సబ్‌స్క్రిప్షన్లకు 20.1 శాతం, కిరాణాకు 15.7 శాతం, ఫైనాన్షియల్ సర్వీసెస్‌కు 12.2 శాతం, షాపింగ్‌కు 11.9 శాతం, ఆహారానికి 11.5 శాతం వెళ్తున్నాయి. ఈ ఐదు విభాగాలకే 70 శాతానికి పైగా ఖర్చు చేస్తున్నారు. ప్రయాణాలకు మాత్రం కేవలం 5 శాతం ఖర్చు చేస్తున్నట్లు రిపోర్ట్ తెలిపింది.



