అంత్యక్రియలరోజే ఖమేనీ శిథిల నివాసం వీడియో విడుదల !
ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ నివాసం ఎలా ధ్వంసమైందో చూపిస్తూ ఇరాన్ అధికారిక మీడియా తొలిసారి ఒక వీడియోను విడుదల చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి 28న యూఎస్-ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో ఖమేనీతో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా ప్రాణాలు కోల్పో యారు. ఆ దాడుల్లో టెహ్రాన్‌లోని ఆయన కాంపౌండ్ ఏ స్థాయిలో దెబ్బతిన్నదో ఈ 35 సెకన్ల వీడియోలో కనిపి స్తోంది. ఖమేనీ ముఖ్యసమావేశాలు నిర్వహించే 'ఇమామ్ ఖొమేని హుస్సేనియా' హాల్ మొత్తం కూలి పోయి, శిథిలాలుగా మారిన దృశ్యాలు ఉన్నాయి. ఆయన అంత్యక్రియలు జరిగిన రోజే ఈ వీడియోను ఇరాన్ రిలీజ్ చేయడం విశేషం.

