వెల్వడంలో అభ్యర్థుల పోటీపై ఉత్కంఠ

ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం వెల్వడంలో సర్పంచ్, MPTC ఎన్నికలపై ఆసక్తి పెరుగుతోంది. సర్పంచ్ స్థానం జనరల్ (UR) మహిళకు రిజర్వ్ కావడంతో YCP, TDP అభ్యర్థులతో పాటు సుమారు ఆరుగురు స్వతంత్రులు పోటీకి సిద్ధమవుతున్నారు. MPTC స్థానంలోనూ ఇండిపెండెంట్ల నామినేషన్ల సందడి ఉండే అవకాశముంది. స్వతంత్ర అభ్యర్థులు పార్టీల అభ్యర్థులకు ఎంతవరకు పోటీ ఇస్తారు, ఓట్ల చీలిక ఎవరిపై ప్రభావం చూపుతుంది అనే చర్చ గ్రామంలో సాగుతోంది.



