రహదారిపై ఆక్రమణలు.. వాహనదారులకు తప్పని తిప్పలు
ఎన్టీఆర్ జిల్లాలోని మైలవరం–తిరువూరు జాతీయ రహదారిపై ఆక్రమణలు వాహనదారులకు ఇబ్బందులు కలిగిస్తున్నాయి. మైలవరం ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో సర్వీసింగ్ సెంటర్లు, దుకాణాలు ఏర్పాటు చేయడంతో పాటు ఇనుప కంచెలతో రహదారిని ఆక్రమించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో నిత్యం రద్దీగా ఉండే ఈ మార్గంలో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడటంతో పాటు ప్రమాదాలు జరుగుతున్నాయని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.



