జర్నలిస్టులపై దాడులు.. సుప్రీంకోర్టు ఆదేశం

S.I.R వ్యతిరేక ప్రొటెస్టులను కవర్ చేస్తున్న మహిళా జర్నలిస్టులపై ఢిల్లీ పోలీసులు దాడులు చేస్తున్నారనే అంశంపై CJI సూర్యకాంత్ నేతృత్వంలోని బెంచ్ కీలక ఆదేశం జారీచేసింది. మహిళా జర్నలిస్టులపై ఢిల్లీ పోలీసులు లైంగిక వేధింపులు, డిటైన్ చేశారని ఆరోపిస్తూ NWMI పిటిషన్ వేసింది. జర్నలిస్టుల రక్షణకు గైడ్లైన్స్, స్వతంత్ర విచారణ కోరింది. దీనిపై వివరణ ఇవ్వడానికి సీనియర్ పోలీసు ఆఫీసర్ హాజరుకావాలని బెంచ్ ఆదేశించింది. అక్టోబర్ 15న దీనిపై విచారించనుంది.


