కాసేపట్లో ఖైరతాబాద్ గణేషుడి నిమజ్జనం
TG: కాసేపట్లో హైదరాబాద్ మహా గణపతి నిమజ్జనం జరగనుంది. ఇప్పటికే గణేషుడు ఎన్టీఆర్ మార్గ్‌కి వచ్చేశాడు. ఆ ప్రాంతమంతా కోలాహలంగా ఉంది. భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. NTR మార్గ్‌లో క్రేన్ నంబర్-5 దగ్గర గణేష్ నిమజ్జనం కోసం ఏర్పాట్లు చేశారు. రద్దీ ఎక్కువగా ఉండటంతో తోపులాట జరగకుండా పోలీసులు కంటిన్యూగా సూచనలు చేస్తున్నారు.



