"ఇదే మన మెసేజ్" సౌరవ్ దాస్
"జంతర్ మంతర్ను తిరిగి స్వాధీనం చేసుకున్నాం" అని CJP కో-ఫౌండర్ సౌరవ్ దాస్ xలో వీడియో పోస్ట్ చేశారు. మార్నింగ్ సౌరవ్తోపాటూ.. CJP లీడర్లైన అశుతోష్ రంకా, అజింక్య షిండే, మరికొందరు జంతర్ మంతర్ లోకి సడెన్గా ప్రవేశించారు. CEC జ్ఞానేష్ రిజైన్ చెయ్యాలని స్లోగన్స్ ఇచ్చారు. ఈ ఫ్లాష్ ప్రొటెస్టును ఊహించని పోలీసులు.. వెంటనే అలర్ట్ అయ్యారు. వారిని అదుపులోకి తీసుకొని అక్కడి నుంచి బస్సుల్లో తరలించారు. "యువతగా మనందరికీ ఇదొక సందేశం. మనం ఇది సాధించగలం. జ్ఞానూ, నీ ఆట కట్టేసినట్టే బ్రో!" అని సౌరవ్ ట్వీట్ చేశారు.


