గణేష్ నిమజ్జనం డ్యూటీలో పోలీస్ మృతి
TG: హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై వినాయక నిమజ్జనం డ్యూటీలో ఉన్న కొత్తగూడెం SI కె.వెంకన్నను తెల్లవారుజామున ఓ స్కూటర్ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన కిందపడగా, స్కూటర్ ఆపకుండా వెళ్లిపోయినట్లు వీడియోలో తెలుస్తుంది. మొదట గాయాలు పెద్దగా లేవనుకున్నా, ఆ తర్వాత అస్వస్థతకు గురికావడంతో వరంగల్ MGM హాస్పిటల్‌కి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందారు. సీసీటీవీ ఆధారంగా నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.



