ఫోర్జరీ పత్రాలతో ఆస్తుల స్వాహా.. గ్యాంగ్ అరెస్ట్
TG: సికింద్రాబాద్‌లో నకిలీ పత్రాలతో స్థలాల రిజిస్ట్రేషన్లు చేస్తున్న గ్యాంగ్‌ను SOT పోలీసులు అరెస్టు చేశారు. 1982 నాటి పత్రాలను సైతం నకిలీగా సృష్టించి, ఫోర్జరీ జీపీఏలు, సేల్డీడ్లతో విదేశాల్లో ఉన్న వారి ఆస్తులను కాజేసినట్లు గుర్తించారు. ఎల్బీనగర్లో మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని స్టాంప్ పేపర్లు, స్టాంపులు స్వాధీనం చేసుకున్నారు. 8చోట్ల మార్టిగేజ్ ఆస్తులను నకిలీ పత్రాలతో విడుదల చేసినట్లు పోలీసులు తెలిపారు.

