500 ఏళ్ల నాటి ప్రాచీన శివలింగం పునరుద్ధరణ పనులు

ఉత్తర కాశ్మీర్లోని బారాముల్లా కాళీబాగ్ ప్రాంతంలో 500 ఏళ్ల నాటి శివలింగాన్ని పునరుద్ధరించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. స్థానికులు, పండిట్ సమాజం సుదీర్ఘకాలంగా చేసిన పోరాటం ఫలితంగా ఈ ధార్మిక స్థలానికి జీవం పోసేందుకు రూ.3 లక్షల నిధులను మంజూరు చేశారు. ఈ శివలింగం సుమారు 400 నుండి 500 ఏళ్ల నాటిదని పండిట్ శివానంద్ రోహిత్ జీ తెలిపారు. బారాముల్లా డిప్యూటీ కమిషనర్ ఎస్.ఎఫ్.హమీద్ ఇటీవల ఈ ప్రాంతాన్ని సందర్శించి పనులను చేపట్టాలని అధికారులను ఆదేశించారు.


