← Back to news

పెద్ద విగ్రహాలు కాదు.. పర్యావరణ పరిరక్షణలో పోటీ పడాలి

By DK· 1d ago
పెద్ద విగ్రహాలు కాదు.. పర్యావరణ పరిరక్షణలో పోటీ పడాలి

TG: పెద్ద విగ్రహాల ఏర్పాటులో పోటీ పడకుండా పర్యావరణ పరిరక్షణలో పోటీ పడాలని ఉమ్మడి కరీంనగర్ జిల్లా మాజీ జడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమా సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల గాంధీ చౌరస్తాలో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ చేపట్టారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, రసాయన రంగులతో తయారైన విగ్రహాల నిమజ్జనం వల్ల నీటి వనరులకు హాని కలిగే అవకాశం ఉందని తుల ఉమా తెలిపారు. మట్టి, సహజ రంగులతో తయారైన పర్యావరణహిత విగ్రహాలను ప్రతిష్టించాలని కోరారు. అనంతరం ప్రజలకు మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు.

More in Local